NBK 108 లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్

National Award winning actor arjun rampal on board for NBK 108 movie

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు నటసింహాం బాలకృష్ణ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టే అనిల్ కూడా బాలకృష్ణ కోసం సాలిడ్ కథను తయారుచేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో మరో టాలెంటెడ్ నటుడు కూడా భాగమయ్యాడు. ఆ నటుడు ఎవరో కాదు నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్. ఈసినిమాలో అర్జున్ రాంపాల్ కూడా భాగమైనట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =