అహింస రిలీజ్ డేట్ ఫిక్స్

abhiram daggubatis ahimsa movie release date fixed

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వస్తున్న మరో సినిమా అభిరామ్. తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తనయుడు.. రానా తమ్ముడు అభిరామ్ అవ్వడంతో తన ఎంట్రీ పై అందరికీ ఆసక్తి ఉంది. తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా వస్తున్న సినిమా అహింస. ఇక‌ ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ ప్రీ లుక్ పోస్ట‌ర్ దగ్గర నుండి టీజర్ వరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను అయితే చేస్తున్నారు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే రజత్ బేడీ, సదా, రవి కాలే అలాగే కమల్ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్. చూద్దాం మరి అభిరామ్ కు మొదటి సినిమా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 12 =