తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా జవాన్. వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న అట్లీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటం.. అంతేకాకుండా అట్లీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ముందు జూన్ 2వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ వీఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతుండటంతో సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించిన షారుఖ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. తన సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించగా అందులో ఈసినిమా ఎందుకు లేట్ అవుతుంది అని అడుగగా దానికి షారుఖ్ ఆడియన్స్ కు మంచి అవుట్ ఫుట్ సమ్ థింగ్ డిఫరెంట్ అందించాలంటే టైమ్ పడుతుంది అని తెలిపాడు. ప్రతిఒక్కరూ బ్రేక్ లేకుండా వర్క్ చేస్తున్నారు అని తెలిపారు. ఇంకా అట్లీ తమిళ్ నేర్పించారా అన్న ప్రశ్నకు.. అట్లీ, అనిరుధ్ సాంగ్స్ లో కొన్ని లైన్స్ ను లింప్ సింక్ చేయించారు.. కరెక్ట్ గానే వచ్చిందని అనుకుంటున్నాను అన్నారు. జవాన్ లో ఏం నచ్చందని అడిగిన ప్రశ్నకు.. నావరకూ అయితే ఇది కొత్త జోనర్ అని తెలిపారు. ఇంకా కో స్టార్స్ నయనతార, విజయ్ సేతుపతి గురించి చెబుతూ..నయనతార లవ్వీపర్సన్.. తనతో వర్క్ చేయడం చాలా బాగుంది.. ఇంకా విజయ్ సేతుపతి చాలా హంబుల్ పర్సన్.. బ్రిలియంట్ పర్సన్ విజయ్ నుండి చాలా నేర్చుకోవచ్చు అని చెప్పుకొచ్చాడు.
కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: