100 కోట్ల దిశగా విరూపాక్ష

virupaksha movie closer to 100 cr club

సాయి ధరమ్ తేజ్ కు విరూపాక్షతో సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. రిపబ్లిక్ సినిమా తరువాత ఈసినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టింది. ఈసినిమా అనుకున్నప్పుడే సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఆ తరువాత కోలుకొని షూటింగ్ లో పాల్గొనడానికే చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా ఈసినిమాను కంప్లీట్ చేసి ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే విరూపాక్ష పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమా రిలీజ్ అయి 17 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈసినిమా 91 కోట్ల కలెక్షన్స్ ను కలెక్ట్ చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ఈసినిమాా 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 65 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కలిసి 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. వెరసి మొత్తంగా 17రోజులకు గాను 91 కోట్లను సొంతం చేసుకొని 100 కోట్ల దిశగా వెళుతుంది. మరోవైపు తమిళ్, హిందీ ఇంకా మలయాళంలో మే5వ తేదీన రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా తన నటనకు గాను ప్రశంసలు దక్కాయి. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఇంకా శామ్ దత్ సినిమాటోగ్రఫి ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 4 =