పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. రాామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. దీనిలో భాగంగానే ప్రభాస్ పోస్టర్లు అలానే హనుమాన్ ఇంకా సీత పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ ను రేపు అంటే మే 9 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేశారు. సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు ఈట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మరో క్లారిటీ కూడా ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా ట్రైలర్ ను పలు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పుడు వాటిలో కొన్ని థియేటర్లను క్యాన్సిల్ చేసి వేరే థియేటర్లను యాడ్ చేశారు.
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: