ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు సందడి చేస్తాయి. కొన్ని హిట్ అయితే కొన్ని ఫట్ అయితే. అయితే కొన్ని సినిమాలు మాత్రమే మనసులను హత్తుకునేలా ఉంటాయి. ధియేటర్ బయటకు వచ్చిన తరువాత కూాడా ఆ భావోద్వేగాలు వెంటాడుతుంటాయి. అలాంటి జాబితాలోకే చేరుతుంది ఈమధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని కథ, సన్నివేశాలు, పాత్ర సాధారణ ప్రజలకు దగ్గరగా ఉండటంతో చాలా మందికి కనెక్ట్ అయి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మేకర్స్ కు పదింతలు లాభాలు చేకూర్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అంతర్జాతీయంగా తన సత్తాను చాటుతూనే ఉంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు కేటగిరీల్లో పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈసినిమా తాజాగా మరో రెండు అవార్డులను సొంతం చేసుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో.. ఉత్తమ నటుడు అవార్డు ప్రియదర్శికి, ఉత్తమ సహాయ నటుడు అవార్డును కేతిరి సుధాకర్ రెడ్డికి వచ్చింది.
Two incredible performances 🙌🏻
one remarkable movie ❤️@PriyadarshiPN and #KethiriSudhakarReddy‘s captivating portrayals in #Balagam take top honors at the @CineSweden 2023 👏🏻👏🏻👏🏻 #BalagamGoesGlobal @VenuYeldandi9 @kavyakalyanram @dopvenu @LyricsShyam pic.twitter.com/5v9jjdzwAi— Dil Raju Productions (@DilRajuProdctns) May 8, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: