VD13 త్వరలో షూటింగ్ మొదలు

vijay deverakonda 13th movie shooting update

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస పరాజయాలు అందుకుంటున్నా తనకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్న ఈసినిమాను ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాతో పాటు రీసెంట్ గానే తన 12వ సినిమాను మొదలుపెట్టాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ 13వ సినిమా వస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈసినిమా షూటింగ్ ను కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నట్టు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.