బాలీవుడ్ లో లోపంపై రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ranbir kapoor shocking comments on bollywood

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ రేంజ్ ఎక్కువగా ఉండేది.. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మిగిలిన ఇండస్ట్రీలు వచ్చేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. చాలాా గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది అంతే.. అంతకుముందు అన్నీ వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ స్థాయి బాగా పడిపోయింది. మరోవైపు సౌత్ సినిమా స్థాయి మాత్రం పెరిగిపోతుంది. యంగ్ టాలెంట్, డిఫరెంట్ కథలు, జోనర్స్ తో సౌత్ మాత్రం తమ మార్కెట్ స్థాయిని అంతర్జాతీయంగా పెంచేసుకుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ కి ఈపరిస్థితి రావడంపై ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలే పలు వ్యాఖ్యాలు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు రణబీర్ కూడా తన అభిప్రాయాన్ని చాలా ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో ఉన్న లోపం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో ప్రాశ్చాత్య పోకడ ఎక్కువైందని.. ఇంకా రీమేక్ ల వల్ల కూడా చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఇదే కాకుండా బాలీవుడ్ లో చాలా తక్కువ మంది యాక్టర్లు ఉన్నారు.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వట్లేదు.. కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇవ్వడంలేదు.. కొత్త వారికి అవకాశం ఇస్తేనే మార్పు వస్తుందని చెప్పుకొచ్చాడు. మరి రణబీర్ చెప్పిన సలహాలు ఎవరైనా తీసుకుంటారో లేదో చూడాలి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.