పొన్నియన్ సెల్వన్ 2 జాక్ పాట్ కలెక్షన్స్

ponniyin selvan 2 movie 10 days collections

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అందులోనూ ఒక్క తమిళ్ లోనే చాలా వరకూ షేర్ వచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించడంతో వారికి దగ్గర కథ కావడంతో వారిని బాగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఆ ప్రభావం కలెక్షన్స్ పై కూడా చూపిస్తుంది. ఈసినిమా 10 రోజుల్లో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈ కలెక్షన్స్ లో కూడా దాదాపు 130-140 కోట్ల కలెక్షన్స్ వరకూ తమిళ్ నుండే వచ్చాయి. ఓవర్సీస్ లో (యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్) దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కలిపి 25 నుండి 30 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫీ.. రవి వర్మన్, ఎడిటర్.. ఎ. శ్రీకర్ ప్రసాద్ అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 13 =