శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం.. దానికి తోడు సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్పర్ట్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాను గత ఏడాదే స్టార్ట్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగిఉంటే ఇప్పటికే రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ షూటింగ్ మధ్యలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి. సమంత వేరే సినిమాలతో బిజీ ఉండటం అనంతరం హెల్డ్ ఇష్యూష్ రావడం.. విజయ్ కూడా వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈసినిమాను సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇంకా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే పాటను రిలీజ్ చేశారు. ఈపాట ప్రోమో ఇప్పటికే రిలీజ్ చేయగా ప్రోమోకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఫుల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. సాంగ్ లో విజయ్ ఇంకా సమంత కూడా అందంగా కనిపిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా పాటను రిలీజ్ చేశారు.
Wooing ‘Aara Begum’ with a lovely Melody ❤️#Kushi First Single out now!
– https://t.co/ppoHHuX9QoHappy Birthday @TheDeverakonda 💥#NaRojaNuvve #TuMeriRoja #EnRojaaNeeye #NannaRojaNeene #EnRojaNeeye@Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/pJq29wJ2OX
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































