సుధీర్ బాబు హరోం హర రిలీజ్ డేట్ ఫిక్స్

sudheer babu harom hara movie release date fixed

టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక రేపు సుధీర్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఒకరోజు ముందుగానే తన సినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు. ఫస్ట్ ట్రిగ్గర్ అంటూ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రేడియోలో వాతావరణ రిపోర్ట్ తో వీడియో ప్రారంభమవుతుంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు. అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తారు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదలౌతుంది. “అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు… కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది… ఇది నాకేమో సెప్తావుంది…” అని సుధీర్ బాబు కుప్పం యాసలో అదరగొట్టాడు. మాండలికం, అతని వాయిస్ బేస్ పాత్రకు ఇంటెన్స్ తెస్తుంది. సుధీర్ బాబు ఈసినిమా కోసం పూర్తిగా మేకోవర్ ను అయితే మార్చేశాడు. ఫస్ట్ ట్రిగ్గర్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. దీనితో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా హరోం హర ను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై సుమంత్‌ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =