
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 4


ధమాకా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ తనకే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్స్

అఫీషియల్- గూఢచారి సీక్వెల్ అనౌన్స్ మెంట్

రిస్క్ చేయడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను

రవితేజ రావణాసుర మూవీ అప్ డేట్

నెక్ట్స్ షెడ్యూల్ కోసం కర్నూల్ కు RC 15 టీమ్

ఎన్టీఆర్ తో సినిమాపై దిల్ రాజు రియాక్షన్

తన రిటైర్మెంట్ పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్

పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

త్వరలో 7/G బృందావన కాలని మూవీ సీక్వెల్

స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్

పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రీ రిలీజ్ రికార్డ్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎస్.జె.సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా తెరకెక్కిన ఖుషి మూవీ 2001 ఏప్రిల్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరించారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు ఖుషి మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో ఖుషి మూవీ న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీ రీరిలీజ్ కానుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

ధమాకా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ తనకే
మాస్ మహారాజాకు మరోసారి సరైన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ధమాకా సినిమాతో నిరూపించాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. కామెడీకి కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్, సంగీతం అన్నీ ఈసినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అందుకే ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గట్లేదు. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే ఈసినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్స్
పాన్ ఐడియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభాస్ హీరోగా సలార్ , ప్రాజెక్ట్ K మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా లో ప్రసారం అవుతున్న, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ సీజన్ 2. ప్రోగ్రామ్ కు హీరో ప్రభాస్ , స్టార్ గోపీచంద్ తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి వచ్చిన ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయదానికి ఆహా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ సాంగ్ కు రంగం సిద్దం
బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. చిరు ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తుండటం.. దానికి తోడు ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ ను వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. పూనకాలు లోడింగ్ అనే మరో మాస్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈపాటలో మెగాస్టార్ ఇంకా రవితేజ ఉండటంతో పాటపై అప్పుడే అంచనాలు పెరిగాయి…

ధమ్కీ మూవీ కై సింగర్ గా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్
రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులనుఅలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ పాన్ ఇండియా మూవీ లో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్…

2023వ సంవత్సరం లో బిజీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ?
బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ మూవీ తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా…

అఫీషియల్- గూఢచారి సీక్వెల్ అనౌన్స్ మెంట్
టాలీవుడ్ లో టాలెంటెడ్ నటుల్లో అడివి శేష్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.

రిస్క్ చేయడం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ వరకూ సాగింది. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం ఏర్పరుచుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్లను, బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు అలానే ఫ్లాప్స్ ను కూడా చూశాడు. అయినా కూడా నిలదొక్కుకొని ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు.. ఆ ధైర్యమే ఇప్పుడు తనను ఈ స్థాయిలో ఉంచింది అంటున్నారు దిల్ రాజు కూడా.

రవితేజ రావణాసుర మూవీ అప్ డేట్
అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ట్విట్టర్ ఛార్ట్స్ బిల్ బోర్డు లో నెంబర్ 1 స్థానంలో సోల్ ఆఫ్ వారిసు సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసినఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి , థర్డ్ సింగిల్ సోల్ ఆఫ్ వారిసు సాంగ్స్…

నెక్ట్స్ షెడ్యూల్ కోసం కర్నూల్ కు RC 15 టీమ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నారట.

ఎన్టీఆర్ తో సినిమాపై దిల్ రాజు రియాక్షన్
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. వాటికోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాటిలో ఒక కాంబినేషనే దిల్ రాజు- ఎన్టీఆర్ కాంబినేషన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దిల్ రాజు కాంబోలో ఇప్పటికే బృందావనం మరియు రామయ్యా వస్తావయ్యా సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. దాదాపు పదేళ్లుగా ఎన్టీఆర్ మరియు దిల్ రాజు కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఇంతవరకూ వీళ్లిదరి నుండి మూడో సినిమా రాలేదు.

హీరో రవితేజ కెరీర్ లో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ధమాకా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రావు రమేశ్, జయరాం, తనికెళ్ల భరణి, ప్రవీణ్, సచిన్ ఖేద్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.ధమాకా మూవీకి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుంది.

తన రిటైర్మెంట్ పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రిటైర్మెంట్.. సాధారణంగా రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది.. వయసు పై బడిన వారు తమ బాధ్యతలను తప్పుకుంటూ రిటైర్మెంట్ చెబుతుంటారు.. మరి ఉద్యోగస్తులకైతే రిటైర్మెంట్ ఉంది.. సినీ పరిశ్రమ వాళ్లకు రిటైర్మెంట్ ఉంటుందా అంటే అది వ్యక్తిగత నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉండి.. ఎన్నో సినిమాలు చేసి.. క్షణం తీరిక లేకుండా అలుపెరుగని ప్రయాణం చేసిన వాళ్లు కాస్త బ్రేక్ కోసం రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ అలా తీసుకున్న నటీనటులు చాలా తక్కువే అని చెప్పొచ్చు.

వాల్తేరు వీరయ్య హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

నాగ చైతన్య కస్టడీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నాగ చైతన్య ను చాలా విభిన్నమైన రోల్ లో చూపింబోతున్నాడట వెంకట్ ప్రభు. ఇక ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఇక తమిళ్ లో వెంకట్ ప్రభుకు మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ చిత్రంతో నాగ చైతన్య తమిళ్ లో తన మార్కును వేయడం ఖచ్చితం అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఫ్యాన్స్ కు సర్…

పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. అయితే చాలా కాలం తరువాత పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు.

త్వరలో 7/G బృందావన కాలని మూవీ సీక్వెల్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కిన7/G బృందావన కాలని మూవీ రెండు భాషలలోనూ ఘనవిజయం సాధించింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. హీరో రవికృష్ణ , హీరోయిన్ సోనియా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యువన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. ఈ మూవీ కన్నడ ,ఒడియా, బెంగాలీ, హిందీ భాషలలో రీమేక్ కావడం విశేషం. ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ తెరకెక్కనుంది.

స్టార్ డైరెక్టర్ తో సినిమా కన్ఫామ్ చేసిన గౌతమ్ మీనన్
తమిళ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఒకపక్క సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోపక్క పలు సినిమాల్లో నటుడిగా కూడా తన టాలెంట్ ను చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో గౌతమ్ మీనన్ సెటిల్డ్ నటనకు ఫిదా అవుతున్న మేకర్స్ ఆయనను పలు పాత్రలకు తీసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్ లో గౌతమ్ మీనన్ నటిస్తున్నారు. ఈవిషయాన్ని గౌతమ్ స్వయంగా చెప్పడమే విశేషం. ఇంతకీ గౌతమ్ నటించబోతున్నఆ భారీ ప్రాజెక్ట్ ఏంటంటే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 67 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం విజయ్ అటు లోకేష్ కూడా వారి ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.. అవి పూర్తయిన తరువాత ఈసినిమా…

స్టార్ హీరోయిన్ త్రిష ఫేవరెట్ హీరోయిన్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1 సూపర్ సక్సెస్ అవ్వడంతో త్రిష క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం త్రిష తమిళంలో మూడు, మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దళపతి విజయ్ తో ఒక మూవీ తో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా త్రిష అందుకొన్నట్టు సమాచారం. తాజాగా త్రిష సినిమాలతో పాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బృందా వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లోత్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనటించారు.