వాల్తేరు వీరయ్య పూనకాలు లోడింగ్ సాంగ్ కు రంగం సిద్దం

Waltair Veerayya Poonakalu Loading Song Launch Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie Songs,Waltair Veerayya Songs,Waltair Veerayya Telugu Movie Songs,Waltair Veerayya Movie New Song,Waltair Veerayya Telugu Movie Latest Song

బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. చిరు ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తుండటం.. దానికి తోడు ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ ను వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. పూనకాలు లోడింగ్ అనే మరో మాస్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈపాటలో మెగాస్టార్ ఇంకా రవితేజ ఉండటంతో పాటపై అప్పుడే అంచనాలు పెరిగాయి. అంతేకాదు పలు థియేటర్స్ లో కూడా ఈపాటను రిలీజ్ చేయనున్నారు. హైదరాబాద్ లోని సంధ్య 70 ఎంఎం, నెల్లూరు ఎం 1 సినిమాస్, అనంతపూర్ ఎస్వీ సినీ మ్యాక్స్, రాజమండ్రి స్వామి, గుంటూరు భాస్కర్, విజయవాడ జయరాం థియేటర్స్ లో సాయంత్రం 5 గం. లకు ఈ సాంగ్ ని లాంచ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =