ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.. వాటికోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాటిలో ఒక కాంబినేషనే దిల్ రాజు- ఎన్టీఆర్ కాంబినేషన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు దిల్ రాజు కాంబోలో ఇప్పటికే బృందావనం మరియు రామయ్యా వస్తావయ్యా సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. దాదాపు పదేళ్లుగా ఎన్టీఆర్ మరియు దిల్ రాజు కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఇంతవరకూ వీళ్లిదరి నుండి మూడో సినిమా రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఎన్టీఆర్ తో సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన.. నాకు ఎన్టీఆర్ కు మంచి అండర్ స్టాండింగ్ ఉంది.. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ దగ్గర స్క్రిప్ట్స్ ను చెక్ చేశాం.. త్వరలోనే ఒక కథను ఎంపిక చేసుకుంటాం.. మేము కూడా కలిసి పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.. త్వరలోనే కలిసి పనిచేస్తాం అని తెలిపారు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో..
ఇక ప్రస్తుతం దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కేవలం తెలుగు లో మాత్రమే కాదు అటు తమిళ్ ఇంకా హిందీ పరిశ్రమలపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే దిల్ రాజు నుండి వస్తున్న విజయ్ వారిసు సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. సంక్రాంతి బరిలో ఈసినిమా దిగనుంది. ఇక మరోవైపు శంకర్ లాంటి డైరెక్టర్ తో రామ్ చరణ్ హీరోగా ఆర్సీ 15 సినిమా చేస్తున్నాడు. ఇంకా ఈసినిమాలతో పాటు పలు సినిమాలు దిల్ రాజు లిస్ట్ లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: