ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

itlu maredumilli prajaneekam trailer release date fixed, Itlu Maredumilli Prajaneekam Theatrical Trailer, Itlu Maredumilli Prajaneekam Trailer, Itlu Maredumilli Prajaneekam Movie Trailer, Allari Naresh, Anandhi, AR Mohan, Allari Naresh Latest Movie, Allari Naresh's Upcoming Movie, Itlu Maredumilli Prajaneekam, Itlu Maredumilli Prajaneekam Movie, Itlu Maredumilli Prajaneekam Update, Itlu Maredumilli Prajaneekam New Update, Itlu Maredumilli Prajaneekam Latest Update, Itlu Maredumilli Prajaneekam Movie Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Latest News, Itlu Maredumilli Prajaneekam Telugu Movie Live Updates, Itlu Maredumilli Prajaneekam Telugu Movie New Update, Itlu Maredumilli Prajaneekam Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఒకప్పుడు కామెడీ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు రూటు మార్చాడు. కొంతకాలంగా తనకు సరైన హిట్ లేకపోవడంతో కెరీర్ కాస్త డల్ అయింది. ఆ తరువాత మహేష్ మహర్షి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఆతరువాత విజ‌య్ క‌న‌క‌మేడ‌ల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన నాంది సినిమా నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం అందించి..నరేష్ నటనలోని మరో కోణాన్ని బయటపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అల్లరి నరేష్ తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేథ్యంలోనే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమా ట్రైలర్ ను రేపు అంటే నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 11న మొదట థియేటర్స్ లో అలానే నవంబర్ 12న డిజిటల్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో న‌రేష్ ఎల‌క్ష‌న్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. ఆనంది ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌.

ముందుగా ఈసినిమాను నవంబర్ 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా రీసెంట్ గానే ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =