సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈసినిమా. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చి పెట్టింది. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికోసం చాలా టైమ్ నే తీసుకొని సాలిడ్ స్క్రిప్ట్ ను రెడీ చేశారు. ఇక ఇటీవలే పుష్ప 2 కోసం అల్లు అర్జున్‌తో ఫొటోషూట్ కూడా చేసింది సుకుమార్ టీం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు మొదలవుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే నవంబర్13 నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమా షూటింగ్ ను థాయ్ లాండ్ లోని ఇంట్రెస్టింగ్ లొకోషన్స్ లో చిత్రీకరించనున్నారట. అంతేకాదు 40 శాతం షూటింగ్ బ్యాంకాక్, థాయ్ లాండ్ లోని ఫారెస్ట్ లో జరపనున్నారట. భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను అక్కడ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దాదాపు 20రోజుల పాటు ఈసినిమా షూటింగ్ ను అక్కడ జరపనున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ డైరెక్టుగా బ్యాంకాక్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతాడని అంటున్నారు.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: