ఈఏడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ తరువాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని ఇక ఇప్పుడు తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టి ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది కూడా. ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్ కు సిద్దమవుతుంది చిత్రయూనిట్. ఈనెల చివరిలో కానీ వచ్చే నెల మొదటిలో కానీ ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సెకండ్ షెడ్యూల్ కోసం మహేష్ బాబు కూడా అప్పుడే ట్రైనింగ్ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ముందే ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























