రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి.. అందుకు తగ్గట్టే అప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు. కానీ తెలిసిందే కదా.. అప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే మార్చి 25న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషస్స్ షురూ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఎత్తర జెండా అనే ప్రమోషన్ ఆంథమ్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాాగా ఈసినిమా నుండి ‘ఎత్తర జెండా’ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ నుఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఇక ప్రోమో మాత్రం కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటుంది. నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా అంటూ సాగే ఈ సాంగ్‌లో తారక్, చెర్రీ, ఆలియా కలర్‌ఫుల్‌గా కనిపించారు.
Here’s #RRRCelebrationAnthem Promo..🕺💃🕺⚡️⚡️
Full song on March 14th, 4 pm!
An @mmkeeravaani Musical!#RRRonMarch25th #RRRMovie #EttharaJenda #Sholay #Koelae #EtthuvaJenda #EtthukaJenda
— RRR Movie (@RRRMovie) March 12, 2022
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.