సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేశాడు.. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకోనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. నిజానికి ఎప్పుడో ఈసినిమా షూటింగ్ పూర్తవ్వాలి కానీ.. కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈసినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గానే ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా అప్పుడే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేశారు చిత్రయూనిట్. ఆగష్ట్ 12న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
An Action Spectacle awaits you in theatres 😎
THE WILD ONE🤙🏻#AGENT⚡️ Reporting in theatres from AUGUST 12th 2022 💥💥💥#AGENTonAugust12 🔥@AkhilAkkineni8 @mammukka @DirSurender @AnilSunkara1 @hiphoptamizha @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/lHKDvNwGjC
— AK Entertainments (@AKentsOfficial) March 11, 2022
కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























