
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 177


"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ ట్రైలర్ రికార్డ్

భారీ యాక్షన్ షెడ్యూల్ లో మెగా 154

సీనియర్ హీరోయిన్ లైలా కోలీవుడ్ రీ ఎంట్రీ

'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్..!

500 కోట్ల క్లబ్ లో "ఆర్ ఆర్ ఆర్ "

"ఆచార్య" సిద్ధ బర్త్ డే లుక్

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం

'కృష్ణ వ్రింద విహారి' టీజర్ రిలీజ్

"ది వారియర్"మూవీ రిలీజ్ డేట్

రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్


తనయుడు చరణ్ కు చిరు బర్త్ డే విషెస్

అందరి అంచనాలకు ధీటుగా 'కె.జి.యఫ్2' ఉంటుంది..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా కె.జి.యఫ్ చాప్టర్2. పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కె.జి.యఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రూపొందుతుంది. దీంతో ఈసినిమా కోసం ఎప్పటినుండో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ ట్రైలర్ రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.“కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్…

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ అద్భుతం ! వర్ణనాతీతం - గుణశేఖర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 3 రోజులలో 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

భారీ యాక్షన్ షెడ్యూల్ లో మెగా 154
సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలతోపాటు చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ ను ప్రారంభించింది. మెగా 154 టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

సితార 'పెన్నీ' సాంగ్ మేకింగ్
మహేష్ బాబు గారాల పట్టి సితారకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుండే సితారకు మంచి క్రేజ్ ఉంది. తన వీడియోలతో, సోషల్ మీడియా అప్ డేట్స్ తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది సితార. ఇక రీసెంట్ గా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాతో ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ లో సితార కనిపించి అందరికీ షాకిచ్చింది. అంతేకాదు ఆ పాటలో తన స్టెప్స్ కు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఆమె వేసిన స్టెప్పులకు మహేష్ అభిమానులు మాత్రమే కాదు.. సినీ ప్రేమికులంతా ఫిదా అయిపోయారు. ఇక సితార కూడా అడియన్స్ కు తన సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ కూడా…

'అంటే సుందరానికి' డబ్బింగ్ పూర్తి చేసుకున్న నజ్రియా.. ఎమోషనల్ పోస్ట్..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే నాని బర్త్ డే రోజు వచ్చిన గ్లింప్స్ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈసినిమాలో నజ్రియా లీలా థామస్ పాత్రలో నటిస్తుంది.

"ఆర్ ఆర్ ఆర్ "సక్సెస్ పార్టీ లో స్టార్ హీరోయిన్ అనుష్క
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

సీనియర్ హీరోయిన్ లైలా కోలీవుడ్ రీ ఎంట్రీ
"దుష్మన్ దునియా కా (1996)మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన లైలా "ఎగిరే పావురమా "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు తమిళ, మలయాళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలతో లైలా ప్రేక్షకులను అలరించారు. సూర్య హీరోగా తెరకెక్కిన "నందా", "పితామగన్"(శివపుత్రుడు ) తమిళ మూవీస్ లో లైలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2006 జనవరి 6వ తేదీ ఇరానీ బిజినెస్ మెన్ మెహదీ ని వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు.

'లైగర్' కాంబోలో మరో ప్రాజెక్ట్.. మిషన్ లాంచ్ కు టైమ్ ఫిక్స్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

'హరిహర వీరమల్లు' కొత్త షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్..!
రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుసగా వకీల్ సాబ్, భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్ లను దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు పవన్. ఈసినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే మధ్యలో భీమ్లానాయక్ సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో ఈసినిమా షూటింగ్ లేట్ అవుతుంది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు మేకర్స్. దీనికోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ని కూడా నిర్మించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తో దాదాపు…

500 కోట్ల క్లబ్ లో "ఆర్ ఆర్ ఆర్ "
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.

'రాధేశ్యామ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా డీసెంట్ హిట్ ను దక్కించుకుంది. రాాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఈసినిమాలోని ప్రభాస్-పూజాహెగ్డేల కెమిస్ట్రీ, విజువల్స్, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది.

"ఆచార్య" సిద్ధ బర్త్ డే లుక్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. "ఆచార్య" మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు సినిమా ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకునే వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో లాంటి మాస్ పాత్రలో అయినా.. అలానే ఎఫ్ 2 మూవీలోని కామెడీ పాత్ర అయినా చాలా ఈజ్ తో చేయగలడని నిరూపించాడు. అందుకే వరుస హిట్లతో కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గని అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఏప్రిల్ 8న ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇకఈసినిమాతో పాటు ఎఫ్ 3…

లిటిల్ గ్రాడ్యుయేట్ అర్హ కు అభినందనలు - అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన “పుష్ప:ది రైజ్ “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు “పుష్ప:ది రైజ్ “మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప:ది రూల్ “మూవీకి ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ అల్లు అర్జున్ పలు ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

'కృష్ణ వ్రింద విహారి' టీజర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు. ఒక పక్క మాస్ సినిమాలు చేస్తూనే మరోపక్క కూల్ పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈసినిమా ఏప్రిల్ 22న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. దీనిలోభాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అనిల్ రావిపూడి చేతుల మీదుగా…

"ది వారియర్"మూవీ రిలీజ్ డేట్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. "ది వారియర్"మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్
మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం"#RC15 "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "ఆర్ ఆర్ ఆర్ "మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో స్టార్ కపుల్స్ సందడి చేశారు. రామ్ చరణ్ - ఉపాసన , ఎన్టీఆర్ - ప్రణతి , రాజమౌళి కుమారుడు కార్తికేయ అతని భార్యరామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేశారు.

కె.జి.యఫ్ 2 ట్రైలర్ రిలీజ్.. నాకు వయెలెన్స్ నచ్చదు.. వయెలెన్స్ కు నేను నచ్చుతా..!
కన్నడ స్టార్ హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్కాంబినేషన్ లో వచ్చిన కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి చాప్టర్ 2 రాబోతుంది. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా ఏప్రిల్ 14న రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కె.జి.యఫ్ 2 సినిమా…

తనయుడు చరణ్ కు చిరు బర్త్ డే విషెస్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మల్టీ స్టారర్ "ఆర్ ఆర్ ఆర్ " మూవీ సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. "ఆర్ ఆర్ ఆర్ " మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బర్త్ డే (మార్చి 27) ను గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖుల , ప్రేక్షక , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి.