న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే నాని బర్త్ డే రోజు వచ్చిన గ్లింప్స్ చాలా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈసినిమాలో నజ్రియా లీలా థామస్ పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా డబ్బింగ్ ను పూర్తి చేసుకుంది నజ్రియా. ఈ సందర్బంగా ఈవిషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈరోజు నేను తొలిసారిగా తెలుగులో నటిస్తున్న వివేక్ దర్శకత్వంలో వస్తున్న అంటే సుందరానికి సినిమా డబ్బింగ్ కంప్లీట్ అయింది. నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు వివేక్.. ఒక ఏడాదిపాటు జరిగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో నీతో ప్రతి వర్కింగ్ డే చాలా ఎంజాయ్ చేశాను.. నిజంగా సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేను చాలా మిస్సవుతున్నా..మొత్తానికి సినిమా పూర్తయింది. లీలా థామస్, డైరెక్టర్ వివేక్‌ను చాలా మిస్సవుతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
View this post on Instagram
మరి రాజా రాణి సినిమాలో నజ్రియా నటనకు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. దీంతో ఇప్పుడు ఈసినిమాలో కూడా నజ్రియా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాని కి జోడీగా నటిస్తుండటంతో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతుందనే అనిపిస్తుంది. చూద్దాం మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: