సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలతోపాటు చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ ను ప్రారంభించింది. మెగా 154 టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి, ఫైటర్స్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ లక్ష్మణ్ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ అభిమానులకి, మాస్ ఆడియన్స్ కి ఒక కిక్ ఇచ్చేలా ఉండబోతుందని అంటున్నారు మేకర్స్.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: