ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా కె.జి.యఫ్ చాప్టర్2. పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కె.జి.యఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రూపొందుతుంది. దీంతో ఈసినిమా కోసం ఎప్పటినుండో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ ‘‘పునీత్ రాజ్ కుమార్‌గారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. మనకే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటు. ఆయనతోనే హోంబలే ఫిలింస్ ప్రారంభమైంది. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. కె.జి.యఫ్2 గురించి మాట్లాడాలంటే ఈ సినిమాలో నా ప్రాముఖ్యత అత్యంత తక్కువనే చెప్పాలి. ఈ సినిమా కన్నడ సినీ ప్రేక్షకుల కల. ఇక్కడకు వచ్చిన ప్రతివాళ్లు గత సారి కంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు. ఈ ప్రయాణం వెనుక విజయ్ కిరగందూర్ అనే వ్యక్తి అండగా నిలిచారు. కె.జి.యఫ్ గురించి ఆలోచించినప్పుడు, మాట్లాడినప్పుడు చాలా మంది మనల్ని పిచ్చోళ్లు అని అనుకుంటారు. కానీ విజయ్ కిరగందూర్‌గారు మా వెనుక నిలబడ్డారు. మేం ఆశించిన దాని కంటే ఎక్కువగానే మాకు అందించారు. పార్ట్ 1 సక్సెస్ తర్వాత చాలా మంది నాకు క్రెడిట్ అందించారు. కానీ అదంతా వట్టిదే. కానీ.. ఈ సినిమా క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్‌కే దక్కుతుంది. ఈ సినిమా తన కల. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ భువన గౌడ, రవి బస్రూర్ సంగీతం సహా పలువురు టెక్నీషియన్స్ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంత గొప్ప వర్కింగ్ టీమ్‌ను ఎక్కడా చూసుండనని గర్వంగా చెప్పగలను అని తెలిపారు.
అనిల్ టడాని, రితేష్, పర్హాన్ అక్తర్, పృథ్వీ రాజ్ కుమార్ వంటి వారు మాపై నమ్మకంతో సినిమాను ప్రేక్షకులకు అందించడానికి ముందుకు వచ్చారు. రవీనాటాండన్ గొప్ప నటి. ఆమెతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంజయ్ దత్ గారు గొప్ప ఫైటర్. ఆయన ఎంత గొప్ప నటి అయినా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన ఈ సినిమా కోసం ఎంత కమిట్‌మెంట్‌గా పనిచేశారో అందరికీ తెలుసు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని అధిగమించి ముందుకు తీసుకెళ్లారు. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. కానీ.. శ్రీనిధి శెట్టి ఈ సినిమా కోసం ఆరేళ్లు కష్టపడింది. ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమించి ఈ సినిమాలో నటించారు. నా అభిమానులకు థాంక్స్. ఇన్నేళ్లు నన్ను అభిమానించారు. వారు నన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు.
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్‌లతో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: