డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ 3 రోజులలో 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రతి frame లోనూ మీరు @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @DOPSenthilKumar @sabucyril @DVVMovies కనబర్చిన ప్రతిభ అద్భుతం ! వర్ణనాతీతం !! తిరిగి ప్రపంచ BOX OFFICE కి కళ తెప్పించిన మీకు హృదయపూర్వక అభినందనలు 🙏 pic.twitter.com/cCXMdgZXB3
— Gunasekhar (@Gunasekhar1) March 28, 2022
“ఆర్ ఆర్ ఆర్ ” మూవీపై ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారీ చిత్ర దర్శకుడు గుణశేఖర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ మీరు (ఎస్. ఎస్. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ఎమ్ఎమ్ కీరవాణి, డిఓపీ సెంథిల్ కుమార్, సాబుసిరిల్, డీవీవీ దానయ్య) కనబరిచిన ప్రతిభ అద్భుతం! వర్ణనాతీతం!!.అనీ , తిరిగి ప్రపంచ బాక్స్ ఆ ఫీస్‌కి కళ తెప్పించిన మీకు హృదయపూర్వక అభినందనలు.అంటూ గుణశేఖర్ ట్వీట్ చేశారు.గుణశేఖర్ దర్శకత్వం లో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్య కావ్యం “శాకుంతలం “మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: