కన్నడ స్టార్ హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కాంబినేషన్ లో వచ్చిన కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి చాప్టర్ 2 రాబోతుంది. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా ఏప్రిల్ 14న రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కె.జి.యఫ్ 2 సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. మొదటి భాగాన్ని మించేలా రెండో పార్ట్ తెరకెక్కించాడని అర్థమవుతుంది. రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేము అంటూ మొదలైన ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని ఉన్నాయి. నాకు వయెలెన్స్ నచ్చదు.. కానీ వయెలెన్స్ కు నేను నచ్చుతాను.. అందుకే నేను వదిలినా అది వదలదు నన్ను అంటూ యష్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. బిజినెస్ చేద్దామా.. ఆఫర్ క్లోజెస్ సూన్ అంటూ పలు డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు గూస్బంప్స్ తెప్పించేలా విజువల్స్ ఉన్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
The next big storm is here !!
All the best @TheNameIsYash and @prashanth_neel
Looking forward to the next chapter of #KGFchapter2
Here’s the trailer: https://t.co/hI9IbywcJH@hombalefilms @HombaleGroup @VKiragandur @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies pic.twitter.com/3rIZlE8iIB— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2022
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























