హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.“కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన తూఫాన్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Records.. Records.. Records..💥
Rocky don’t like it, He avoids, But Records likes Rocky!
He Cannot avoid it.𝟏𝟎𝟗 + 𝐌𝐢𝐥𝐥𝐢𝐨𝐧 𝐕𝐢𝐞𝐰𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐇𝐨𝐮𝐫𝐬 ♥️🙏
Kannada: 18M
Telugu: 20M
Hindi: 51M
Tamil: 12M
Malayalam: 8M#KGFChapter2Trailer #KGFChapter2 pic.twitter.com/n6pspljdxj— Hombale Films (@hombalefilms) March 28, 2022
“కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ట్రైలర్ ను 27 వ తేదీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని అన్ని భాషల్లో కలిపి 24గంటలలో 109 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.ట్రైలర్‌కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్, తెలుగులో 20,హిందీలో 51, తమిళంలో 12, మలయాళంలో 8మిలియన్ వ్యూస్ వచ్చాయి. రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదనీ , అందుకు తప్పించుకుంటాడనీ , కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయనీ , . అందుకే వాటి నుంచి తప్పించుకోలేడనీ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. దక్షిణాది భాషల తో పాటు హిందీ భాషలో రిలీజ్ కానున్న “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: