
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 147


ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు..!

అల్లు అర్జున్ పై కంగనా రనౌత్ ప్రశంసలు

'లైగర్' విజయ్ పై అనన్య ప్రశంసలు..!

విజయ్- సమంత మూవీ టైటిల్ రిలీజ్..!

కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్

మార్వెల్ స్టైల్ లో ప్రశాంత్ నీల్ సినిమాలు..!
'ది వారియర్' టీజర్ రిలీజ్..!

"ఆదిపురుష్ " మూవీపై ఆసక్తికర న్యూస్

బీచ్ వ్యూ లో శ్రీ లీల

కశ్మీర్ లో విజయ్ దేవరకొండ బోట్ రైడ్

మహేష్ బాబు పై సయీ మంజ్రేకర్ కామెంట్స్

'కార్తికేయ 2' డబ్బింగ్ పూర్తి చేసిన నిఖిల్..!

“#Thalapathy66” మూవీ సెట్స్ లో రష్మిక

వచ్చే వారం “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ కు వెంకటేష్ ?

'ధోని'తో నయన తార సినిమాపై క్లారిటీ..!

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'థాంక్యూ'

"F3 " మూవీ పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు..!
నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది జరగదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి…

‘వాంటెడ్ పండుగాడ్’.. అనసూయ ఫస్ట్ లుక్ రిలీజ్
బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగిస్తూనే మరోపక్క సినిమా అవకాశాలను కూడా అస్సలు వదులుకోవట్లేదు అనసూయ. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తుంది. సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో వాంటెడ్ పండుగాడ్.. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్ తో ఓ కొత్త సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అల్లు అర్జున్ పై కంగనా రనౌత్ ప్రశంసలు
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ లో సుమారు 130 కోట్లు…

'లైగర్' విజయ్ పై అనన్య ప్రశంసలు..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, అలానే హంట్ థీమ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

విజయ్- సమంత మూవీ టైటిల్ రిలీజ్..!
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.. అలానే స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తే క్రేజీ గా ఉంటుంది కదా. ఇప్పటికే మహానటి సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే ఆ సినిమాలో చాలా తక్కువ సేపే ఉంటుంది వీరి నిడివి. అయినా కూడా ఇద్దరి కాంబినేషన్ అందరికీ నచ్చేసింది. ఇక ఇప్పుడు ఒక కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. సమంతతో మజిలీ లాంటి సినిమాతో హిట్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని చాలా వేగంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే సామ్ ఇంకా విజయ్ ఇద్దరి…

కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

'ప్రాజెక్ట్ K' ప్రభాస్ కోసం ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్..!
టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం నాగ్ అశ్విన్ కూడా పలు రీసెర్చ్ లు కూడా చేసేస్తున్నాడు. దానికి తగ్గట్టే ఈసినిమాలో తారాగణం దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో కూడా అంతా హై క్వాలిటీతోనే వస్తున్నారు. ఇఈసినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రభాస్…

మార్వెల్ స్టైల్ లో ప్రశాంత్ నీల్ సినిమాలు..!
కన్నడ సినీ పరిశ్రమకు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా కె.జి.యఫ్ సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. అప్పటికే బాహుబలి సినిమాతో సౌత్ ఇండస్ట్రీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకోగా.. ఆసినిమా స్పూర్తితోనే తెరకెక్కిన కె.జి.యఫ్ సినిమా కూడా మరోసారి సౌత్ సినిమా సత్తాను చాటింది. ఇక కె.జి.యఫ్ సినిమా కన్నడ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది. కేవలం కన్నడలోనే కాదు తెలుగు, తమిళ్ లోనే కూడా మంచి హిట్ అయింది. ఇక నార్త్ లో అయితే ఏ రేంజ్ లో ఈసినిమా ప్రభంజనం…
'ది వారియర్' టీజర్ రిలీజ్..!
కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్న ఈసినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. ఇక జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈసినిమాను విడుదల చేయనున్నారు.ఈనేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

"ఆదిపురుష్ " మూవీపై ఆసక్తికర న్యూస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. "ఆదిపురుష్ " మూవీ తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

బీచ్ వ్యూ లో శ్రీ లీల
కమర్షియల్ హిట్ “పెళ్ళి సందD ” మూవీ తో శ్రీలీల టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. పలు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

'సర్కారు వారి పాట' కలెక్షన్స్ సన్సేషనల్ వీకెండ్..!
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకుల కుంభకోణాల నేపథ్యంలో పరుశురాం ఈసినిమాను సందేశాత్మకంగా రూపొందించాడు. ఇక ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఎంటర్ టైన్ మెంట్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. ముందు నుండీ చెబుతున్నట్టే యూఎస్ లో మహేష్-కీర్తి సురేష్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ లుక్ మార్చడం, మరింత యాక్టీవ్ గా నటించడం ఇంకా పాటలు, స్టెప్పులు అన్నీ మహేష్…

కశ్మీర్ లో విజయ్ దేవరకొండ బోట్ రైడ్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్ ” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న మరో మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లైగర్ ” మూవీతో విజయ్ బాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.

మహేష్ బాబు పై సయీ మంజ్రేకర్ కామెంట్స్
కమర్షియల్ హిట్ “దబాంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన సయీ మంజ్రేకర్ , వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సయీ మంజ్రేకర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు.

'కార్తికేయ 2' డబ్బింగ్ పూర్తి చేసిన నిఖిల్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. 2019లో వచ్చిన ‘అర్జున్ సురవరం’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. మధ్యలో కరోనా రావడం కూడా నిఖిల్ కు కలిసిరాలేదు. ఇక ఈఏడాది మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈనేపథ్యంలో ఈఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో కార్తికేయ 2 సినిమా కూడా ఒకటి.

“#Thalapathy66” మూవీ సెట్స్ లో రష్మిక
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#Thalapathy66” మూవీ చెన్నై లో పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

వచ్చే వారం “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ కు వెంకటేష్ ?
తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోలు, హిందీ సినిమాలలో టాలీవుడ్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు "గాడ్ ఫాదర్" మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు. అమీర్ "లాల్ సింగ్ చద్దా" మూవీ లో నాగచైతన్య నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ "F 2" మూవీ సీక్వెల్ "F 3 " మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర కై ఎంపిక అయ్యారు.

'ధోని'తో నయన తార సినిమాపై క్లారిటీ..!
టీమిండియా కూల్ కెప్టెన్ అంటే ఎవరి పేరు చెబుతారు.. ఇంకెవరూ ధోనీనే. కూల్ కెప్టెన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ధోనికి స్పెషల్ పేజ్ ఉంటుంది. ఎన్నో మ్యాచ్ లలో.. టీమిండియా ఓడిపోతుందనుకునే మ్యాచ్ లలో కూడా తన కూల్ ఫినిషింగ్ తో గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ధోని కెప్టెన్ గా మాత్రమే కాకుండా దాదాపు చాలా బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక ఒకపక్క క్రికెట్ ఆడుతూనే మరోపక్క బిజినెస్ రంగంలోకి కూడా వెళుతున్నాడు. ఇప్పటికే చాలా వాణిజ్య ప్రకటనలకు అంబాసిడర్ గా ఉన్నాడు. మరోపక్క ఫామింగ్ కూడా మొదలుపెట్టాడు.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'థాంక్యూ'
టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా తరువాత ఒక సినిమా కాదు.. ఒక సినిమా చేస్తూనే మరో సినిమాను పార్లల్ గా చేస్తూ వెళుతున్నారు. ఇక ఆ లిస్ట్ లో నాగ చైతన్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం చైతు తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. లవ్‌స్టోరి, బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ఇప్పుడు తన ఫోకస్ ను తన కొత్త సినిమాపై పెట్టాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.