టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. “ఆదిపురుష్ ” మూవీ తెలుగు , హిందీ భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హాలీవుడ్ టెక్నాలజీ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “ఆదిపురుష్ “మూవీ లో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సన్నివేశాలు హైలైట్ గా ఉండనున్నాయనీ దర్శకుడు చెప్పారు. రావణ పాత్రలో నటించిన సైఫ్ అలీఖాన్ ని దాదాపు 7 అడుగులు ఉండే భారీ కాయంతో చూపించనున్నారనీ , రాముడు పాత్రలో నటించిన ప్రభాస్ ను 8 అడుగులు ఉండేలా డిజైన్ చేసారనీ , విజువల్ వండర్ గా తెరకెక్కిన “ఆదిపురుష్ ” మూవీలో గ్రాఫిక్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయని సమాచారం .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.