పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్యాంకుల కుంభకోణాల నేపథ్యంలో పరుశురాం ఈసినిమాను సందేశాత్మకంగా రూపొందించాడు. ఇక ఈసినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఎంటర్ టైన్ మెంట్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. ముందు నుండీ చెబుతున్నట్టే యూఎస్ లో మహేష్-కీర్తి సురేష్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈసినిమాలో మహేష్ లుక్ మార్చడం, మరింత యాక్టీవ్ గా నటించడం ఇంకా పాటలు, స్టెప్పులు అన్నీ మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి అప్పుడే మూడు రోజులైపోయింది. ఈ రెండు రోజుల్లో కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ తెలియచేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా కలెక్షన్ల గురించి చిత్రనిర్మాణ సంస్థ అప్ డేట్ ఇచ్చింది. సర్కారు వారి పాట రాంపేజ్ మోడ్ లో ఉందని.. రెండు రోజుల్లో ఈసినిమా రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో దాదాపు 49 కోట్ల షేర్ ను రాబట్టినట్టు తెలిపారు. అంతేకాదు.. మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తో సాలిడ్ కలెక్షన్స్ తో సర్కారు వారి పాట మొదలైందని తెలిపారు. సర్కారు వారి పాట ఖాతాలో సెన్సేషనల్ వీకెండ్ అవ్వబోతుంది అంటూ మేకర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Super🌟@UrstrulyMahesh’s Rampage Mode ON 🔥
After collecting a 2 Days share of 48.53Cr in AP& TS #SVP
DAY- 3 begins on a strong note with Super Solid Advance Bookings 👌💥
A sensational weekend on cards for the #BlockbusterSVP 🤟#SarkaruVaariPaata #SVPMania pic.twitter.com/nPPALgeTkh
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 14, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.