విజయ్- సమంత మూవీ టైటిల్ రిలీజ్..!

Vijay Deverakonda And Samantha New Movie Title Revealed,VD11 First Look,Title,And Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, VD11,VD11 Movie,VD11 Telugu Movie,Vijay Deverakonda VD11 Movie Updates,VD11 Vijay Deverakonda ovie Title and First Look Released,VD11 First Look Released, VD11 Title Released,Vijay Deverakonda VD11 Movie Titled,Vijay Deverakonda and Samantha Movie VD11 First Look and Title Released,Vijay Deverakond VD11 Movie Titled Kushi, Kushi Movie Updates,Samantha and Vijay Deverakonda Movie Titled Kushi,Kushi Movie First Look Released,Director Shiva Nirvana Upcoming Movie Kushi with Vijay Deverakonda and Samantha

టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.. అలానే స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తే క్రేజీ గా ఉంటుంది కదా. ఇప్పటికే మహానటి సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అయితే ఆ సినిమాలో చాలా తక్కువ సేపే ఉంటుంది వీరి నిడివి. అయినా కూడా ఇద్దరి కాంబినేషన్ అందరికీ నచ్చేసింది. ఇక ఇప్పుడు ఒక కొత్త సినిమాతో వచ్చేస్తున్నారు. సమంతతో మజిలీ లాంటి సినిమాతో హిట్ అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని చాలా వేగంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే సామ్ ఇంకా విజయ్ ఇద్దరి పుట్టినరోజులు కూడా ఇదే షూట్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్ర బృందం. ఈసినిమాకు ఖుషి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం విశేషం. ఈసినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇంకా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఖుషి టైటిల్ తో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు ఎన్ని తిరిగిరాసిందో చూశాం. పవన్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అది. ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం.
కాగా ఈసినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =