టాలీవుడ్ యంగ్ హీరోలు అందరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా తరువాత ఒక సినిమా కాదు.. ఒక సినిమా చేస్తూనే మరో సినిమాను పార్లల్ గా చేస్తూ వెళుతున్నారు. ఇక ఆ లిస్ట్ లో నాగ చైతన్య కూడా ఉన్నాడు. ప్రస్తుతం చైతు తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. లవ్‌స్టోరి, బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ఇప్పుడు తన ఫోకస్ ను తన కొత్త సినిమాపై పెట్టాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కూడా కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మరోవైపు విదేశాల్లో కూడా ఈసినిమా షూటింగ్ కూడా ఉండటంతో షూటింగ్ కు లేట్ అయింది. దీనివల్ల రిలీజ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. జూన్ 8వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
The date is set!
Get ready to experience the magic of @chay_akkineni’s, #ThankYouTheMovie on July 8th, 2022 in theaters❤️@Vikram_K_Kumar@RaashiiKhanna_@MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouOnJuly8th pic.twitter.com/9YE52vleFZ
— Sri Venkateswara Creations (@SVC_official) May 14, 2022
కాగా ఈసినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. . టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: