బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగిస్తూనే మరోపక్క సినిమా అవకాశాలను కూడా అస్సలు వదులుకోవట్లేదు అనసూయ. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అనసూయ ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తుంది. సునీల్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో వాంటెడ్ పండుగాడ్.. ‘పట్టుకుంటే కోటి’ ట్యాగ్ లైన్ తో ఓ కొత్త సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. శ్రీధర్ సీపానగారి దర్శకత్వంలో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. ఈసినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మారేడుమిల్లిలో పెద్ద షెడ్యూల్‌ను పూర్తి చేశాం. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మూడు, నాలుగు రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
Meet #Chukka 💫 https://t.co/UvN5rJURVg
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 15, 2022
కాగా ఈసినిమాలో ఇంకా వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, బ్రహ్మానందం, రఘుబాబు, అనంత్, పుష్ప జగదీష్, నిత్యా శెట్టి, వసంతి, విష్ణు ప్రియ, హేమ, షకలక శంకర్, తనికెళ్ల భరణి, ఆమని, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు నటిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మిస్తున్న ఈసినిమాకు మహి రెడ్డి పండుగుల సినిమాటోగ్రఫీ.. పి.ఆర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: