కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్న ఈసినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. ఇక జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈసినిమాను విడుదల చేయనున్నారు.ఈనేపథ్యంలో ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిత్రయూనిట్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘బుల్లెట్’ అనే సాంగ్ ను విడుదల చేశారు. శింబు పాడిన ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయింది.
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే రామ్ టీజర్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ‘ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నాం అబ్బా’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఈ సినిమాలో రామ్.. సత్య అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీస్ ను చూశారా? అంటూ రామ్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. విలన్ ఆది రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. రామ్, ఆది మధ్య వార్ చాలా ఇంట్రెస్టింగ్ గాఉండేలా కనిపిస్తోంది. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.
Mass Celebrations started with Massive 1M+ Real time views❤️🔥⚡#TheWarriorrTeaser
Telugu: https://t.co/RBCiV7hAuV
Tamil: https://t.co/h9cwxfbDtQ#HappyBirthdayRAPO @ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @ThisIsDSP @adityamusic @masterpieceoffl pic.twitter.com/Td0q9bcQyo— Srinivasaa Silver Screen (@SS_Screens) May 14, 2022
కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: