సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ– స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, అలానే హంట్ థీమ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బాలీవుడ్ భామ అనన్యపాాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య ఈసినిమా గురించి అలానే విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. విజయ్ ది ఎంతో దయాగుణమని.. అద్భుతమైన వ్యక్తి అని చెప్పింది. అమెరికాలో షూటింగ్ సమయంలో సరదాగా గడిపామని గుర్తు చేసుకుంది. సినిమాకు సంబంధించి దాదాపు అన్నీ పూర్తయ్యాయని, నా డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయిందని చెప్పింది. ఆగష్ట్లో సినిమా విడుదలవుతుందని, మాంచి మసాలా సినిమా అని చెప్పుకొచ్చింది. సినిమాను చూసి అభిమానులు ఆనందిస్తారని తెలిపింది.
ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: