
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 131


"#RC15 " మూవీ లేటెస్ట్ అప్ డేట్

"విక్రమ్ "మూవీ పై దర్శకుడు శంకర్ ప్రశంసలు

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!

కాజల్ అగర్వాల్ సినిమాలకు రీ ఎంట్రీ ?

"#SK 20 " మూవీ కి ఆసక్తికర టైటిల్ ?

'సలార్'.. యాక్షన్ ప్యాక్డ్ తో కొత్త షెడ్యూల్..!

'హనుమాన్' విలన్ ను రివీల్ చేసిన రానా..!

తమిళ , తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ థ్యాంక్స్

మళ్లీ బిజీ అయిన చిరు..!

'మేజర్' అందరూ చూడాల్సిన సినిమా..!

"NBK107" ఫస్ట్ హంట్ లోడింగ్

సమంత మాలీవుడ్ ఎంట్రీ

కియారా అద్వానీ ధర్మశాల టూర్ ఎక్స్ పీరియన్స్

కృతి శెట్టి కి మరో కోలీవుడ్ ఆఫర్ ?

'పక్కా కమర్షియల్' ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్..!
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మారుతి దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్స్ కూడా ఈసినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచనుంది. ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.

"#RC15 " మూవీ లేటెస్ట్ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

"బాహుబలి 2 "వర్సెస్ "ఆర్ ఆర్ ఆర్ "యాక్షన్ వీడియోస్ రిలీజ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

"విక్రమ్ "మూవీ పై దర్శకుడు శంకర్ ప్రశంసలు
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో…

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఇక ప్రివ్యూల నుండే ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈసినిమా కోసం పడిన కష్టానికి ప్రేక్షకులు విజయం అందించడంతో టీమ్ అంతా హ్యీపీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలు చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన మహేష్ తో కూడా మేజర్ టీమ్ రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొని ఒక్కొక్కరి అనుభవాలను పంచుకున్నారు.

'సూర్య'కు కమల్ కాస్ట్లీ గిఫ్ట్..!
మొత్తానికి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వచ్చినా.. వస్తూనే సాలిడ్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈసినిమాకు కోలివుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమల్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది.

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీ కాంత్ తన తరువాత సినిమాకోసం రెడీ అవుతున్నారు. రజనీ తన నెక్ట్స్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాతో రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీతో సినిమాకు సిద్దమవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఇంకా పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

కాజల్ అగర్వాల్ సినిమాలకు రీ ఎంట్రీ ?
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో కాజల్ అగర్వాల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.తన కుమారుడికి కాజల్ నీల్ కిచ్లూ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

"#SK 20 " మూవీ కి ఆసక్తికర టైటిల్ ?
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో "#SK 20" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'సలార్'.. యాక్షన్ ప్యాక్డ్ తో కొత్త షెడ్యూల్..!
ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో అవ్వడం.. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కె.జి.యఫ్ చిత్రాన్ని మించిన థ్రిల్ కలిగించే యాక్షన్ సన్నివేశాలను రెడీ చేస్తున్నాడట ప్రశాంత్‌నీల్. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

'హనుమాన్' విలన్ ను రివీల్ చేసిన రానా..!
టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా , క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలవ్వగా ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది.

తమిళ , తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ థ్యాంక్స్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో…

మళ్లీ బిజీ అయిన చిరు..!
రీఎంట్రీ తర్వాత చిరు కూడా స్పీడు పెంచిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో కరోనా కనుక రాకపోయి ఉంటే ఈ రెండేళ్ల గ్యాప్ లో రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేసి ఉండేవాడు. కానీ కరోనా వల్ల సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. అందులో భాగంగానే ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఆచార్య సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈ మధ్యలో చిరు తన కొత్త సినిమాలను కూడా మొదలు పెట్టాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్నగాడ్ ఫాదర్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేసుకోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా జరుపుకున్నాయి.

'మేజర్' అందరూ చూడాల్సిన సినిమా..!
మరోసారి టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. మొదటి నుండి అడివి శేష్ డిఫరెంట్ కథలతో వస్తాడన్న పేరు ఉంది. అది మరోసారి నిరూపించాడు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న వేళ పేట్రియాటిక్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా మందికి తెలియని ఒక రియల్ హీరో కథను దేశ ప్రజలకు చూపించాడు. దాని ఫలితమే ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాం. సినిమాను చూసినవారందరూ మంచి సినిమాను తీశారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"అంటే .. సుందరానికీ "ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.

'అంటే సుందరానికీ' అన్నీ ఎమోషన్స్ వున్న అరుదైన కథ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా మీడియాతో ''అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. నజ్రియా పంచుకున్న ''అంటే సుందరానికీ' విశేషాలివి.

"NBK107" ఫస్ట్ హంట్ లోడింగ్
బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

సమంత మాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” , క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న"ఖుషి"మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్…

కియారా అద్వానీ ధర్మశాల టూర్ ఎక్స్ పీరియన్స్
కియారా అద్వానీ కమర్షియల్ హిట్ “ఫగ్లీ “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ఎమ్ ఎస్ ధోని :ది అన్ టోల్డ్ స్టోరీ ” మూవీ తో గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి కియారా అద్వానీ తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కియారా కథానాయికగా నటించిన సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ హిందీ రీమేక్ “కబీర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించడం తో కియారా బాలీవుడ్ లో బిజీగా మారారు.

కృతి శెట్టి కి మరో కోలీవుడ్ ఆఫర్ ?
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.