“బాహుబలి 2 “వర్సెస్ “ఆర్ ఆర్ ఆర్ “యాక్షన్ వీడియోస్ రిలీజ్

Baahubali 2 vs RRR Action Videos Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Baahubali 2 vs RRR Action Videos,Rajamouli Baahubali 2 vs RRR Action Videos,Ace Director Rajamouli Movie Baahubali 2 vs RRR Action Videos Released, Baahubali 2 vs RRR Action Videos Out Now,Best Action movie scenes Baahubali 2 vs RRR Action Videos Released,Prabhas and JR NTR,Ramcharan Action Videos Released, Baahubali 2 Action Videos,RRR Action Videos

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “బాహుబలి :ది కంక్లూజన్ ” మూవీ 2017 ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా 1810 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ 2వ ఇండియన్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి 2 “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. “బాహుబలి 2” మూవీ పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికింది.

“ఆర్‌ ఆర్‌ ఆర్‌”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ స్ట్రీమింగ్‌ అవుతుండగా హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం వారంలోనే నెట్ ఫ్లిక్స్ లో 18.6 మిలియన్ల వ్యూస్ తో “ఆర్ఆర్ఆర్” మూవీ ట్రెండింగ్ లో ఉంది.తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించేలా ప్రమోషన్స్ చేస్తుంది. తాజాగా”బాహుబలి 2 ” “ఆర్ ఆర్ ఆర్ ” మూవీస్ యాక్షన్ సీన్స్ ను మిక్స్ చేసి నెట్ ఫ్లిక్స్ సంస్థ వీడియోస్ రిలీజ్ చేయగా, ఆ వీడియోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eight =