మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక మారుతి దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్స్ కూడా ఈసినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచనుంది. ఆ మధ్య విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. దీనిలో భాగంగానే ట్రైలర్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ గ్లింప్స్ లోనే మారుతి కామెడీ యాంగిల్ కనిపిస్తుంది. మీరు కేసు ఒప్పుకునేముందు ఫీజు వద్దు రమ్మంటారు.. పనయ్యాక వాణ్ణి వంగబెట్టి.. అన్న డైలాగ్ శ్రీనివాస్ రెడ్డి చెపుతుండగా వీడియో బఫర్ అవుతుంది.. ఏంటి ఓ నొక్కేస్తున్నారు.. మేమే కావాలని ఆపాము.. ముహూర్తం టైం చూసి జూన్ 12వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేస్తాము ఫుల్ గా చూసి నవ్వుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ మారుతి వీడియోలో తెలిపాడు. మరి చూద్దాం ట్రైలర్ ఇంకెంత కామెడీగా ఉంటుందో..
#PakkaCommercial Trailer Glimpse is out now!😉
𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 𝐨𝐧 𝐉𝐔𝐍𝐄 𝟏𝟐𝐭𝐡😎#AlluAravind @YoursGopichand @DirectorMaruthi@RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @GA2Official @UV_Creations #PakkaCommercialOnJuly1st ✨ pic.twitter.com/ESz5Yowdce
— UV Creations (@UV_Creations) June 8, 2022
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తుంది. ఈసినిమాలో వీరిద్దరూ లాయర్ పాత్రల్లో నటిస్తున్నట్టు ఇప్పటికే అర్థమైపోయింది. ఇంకా ఈసినిమాలో సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి చూడబోతే ఈసినిమాకు పక్కా కమర్షియల్ హిట్ కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: