‘హనుమాన్’ విలన్ ను రివీల్ చేసిన రానా..!

Rana Daggubati Revealed the Villain of Hanuman,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rana Daggubati,Hero Rana Daggubati,Rana Daggubati Latest Movie Updates,Rana Daggubati Movies,Rana Daggubati Telugu Movies,Rana Daggubati Latest Updates, Rana Daggubati Revealed Hanuman Villain,Hanuman Villain Revealed By Rana Daggubati,Rana Daggubati About Hanuman Movie Villain,Hanuman Movie,hanuman Telugu Movie, Hanuman Upcoming Movie,Hanuman Movie Villain Revealed,Hanuman Telugu Movie Revealed By Rana Daggubati

టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా , క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలవ్వగా ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా లో నటిస్తున్న విలన్ పాత్రను రివీల్ చేశారు చిత్రయూనిట్. భల్లాలదేవ రానా దగ్గుబాటి ఈ చిత్రం నుండి ‘బ్యాడాస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్‌ను విడుదల చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ ధరించిన ‘బ్యాడాస్ ఈవిల్ మ్యాన్’ మైఖేల్.. భారీ మెషిన్ గన్‌లను మోస్తున్న తన సైన్యంతో ఫ్లైయింగ్ సాసర్స్ ని తలపించే రోబోటిక్ బ్యాట్స్ నిఘాలో ఒక గుడి ముందు నడుస్తూ రావడం టెర్రిఫిక్ గా వుంది. ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్, పైరేట్ ఐ ప్యాచ్ తో ఈవిల్ మ్యాన్ లా కనిపించిన వినయ్ రాయ్.. తన ఫస్ట్ లుక్ లోనే భయపెట్టారు.

బాట్‌మ్యాన్‌కు జోకర్, సూపర్‌మ్యాన్ కు లెక్స్ లూథర్ లాగా హను-మాన్ కు మైఖేల్ సూపర్‌విలన్. ఐతే మైఖేల్ అందరిలాంటి సూపర్ విలన్ కాదు. మైఖేల్ పాత్రకు గొప్ప క్యారెక్టర్ ఆర్క్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్లు ఉన్నతమైన టెక్నాలజీ అతని సొంతం. అతను ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

కాగా `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =