తమిళ , తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ థ్యాంక్స్

Kamal Haasan Thanks Telugu Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kamal Haasan,Hero Kamal Haasan,Kamal Haasan Thanks Telugu Audience for Making Vikram Movie Success,Kamal Haasan Vikram Movie Success,Kamal Haasan Vikram Movie, Vikram Movie latest Updates,Vikram Movie Latest News,Kamal Haasan Vikram Telugu Movie,Vikram Movie Collections in Telugu States,Vikram Movie latest Collections, Vikram Movie Updates,Vikram Blockbuster Movie Collections

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలలో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” తెలుగు, తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. తాజాగా”విక్రమ్ “మూవీ ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరడం విశేషం. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో “విక్రమ్” మూవీ అన్ని భాషల్లో దూసుకుపోతుంది.ప్రపంచవ్యాప్తంగా200 కోట్ల మార్కుకు చేరువలో ఉన్న ఈ మూవీ నాలుగు రోజుల్లో విక్రమ్ బ్రేక్ ఈవెన్ కి చేరింది.”విక్రమ్” మూవీపై తమిళ , తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణకు, అందించిన విజయానికి కమల్ హాసన్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్న ఆయన మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ  ఒక వీడియోను రిలీజ్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =