‘రజనీ 169’మూవీలో ప్రత్యేకతలు..!

Rajinikanth New Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Latest Movie Updates,Rajinikanth Latest Movies,Rajinikanth Movies,Rajinikanth Super Hit Movies,Rajinikanth Upcoming Movies, Rajinikanth NEw Movie,Rajinikanth 169th Movie Updates,Rajinikanth 169th Movie Details,Rajinikanth 169th movie Latest Updates,

సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీ కాంత్ తన తరువాత సినిమాకోసం రెడీ అవుతున్నారు. రజనీ తన నెక్ట్స్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాతో రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీతో సినిమాకు సిద్దమవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఇంకా పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తుంది. వీరిద్దరూ గతంలో రోబో సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో కూడా ఐశ్వర్యరాయ్ ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. రజనీ వైఫ్ గా ఐశ్వర్యరాయ్ నటించనున్నట్టు సమాచారం.

అంతేకాదు ఈసినిమాలో మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ ను కూడా తీసుకోనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నరసింహ సినిమా వచ్చింది. ఈసినిమా గురించి ఎప్పటికీ మరిచిపోలేరు. తమిళ్ లో వడయప్పా అన్న పేరుతో రిలీజ్ అవ్వగా.. తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ అయింది. ఈసినిమాలో రమ్యకృష్ణ తన విశ్వరూపం చూపించింది. అలాంటి ఒక పవర్ఫుల్ పాత్రలోనే రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపిక జరిగిపోయింది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో జోడీగా ఆమె కనిపించనుంది

ఇక ఈసినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రజనీకాంత్ తనే కథ రాసుకోవడం విశేషం. కేఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చడం మరో విశేషం. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

కాగా సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆగష్ట్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారట. మరి నిజంగా వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. నిజమైతే కనుక మరోసారి క్రేజీ కాంబినేషన్ ను చూడొచ్చు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twenty =