‘మేజర్’ అందరూ చూడాల్సిన సినిమా..!

Vijay Deverakonda Praises on Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Liger Vijay Deverakonda Loves Adivi Sesh’s Major Movie,Vijay Deverakonda latest Updates,Vijay Deverakonda About Major Movie,Vijay Deverakonda Praises Adivi Sesh Major Movie, Vijay Deverakonda About Major Movie,Vijay Deverakonda Comments On Major Movie,Vijay Deverakonda All About Major Movie,Vijay Deverakonda watches Major Movie, Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Kushi Movie Updates,Vijay Deverakonda Liger Movie Updates,Vijay Deverakonda JGM Movie Updates,Vijay Deverakonda Shooting Updates, Vijay Deverakonda With Samantha Upcoming Movie Kushi Updates

మరోసారి టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. మొదటి నుండి అడివి శేష్ డిఫరెంట్ కథలతో వస్తాడన్న పేరు ఉంది. అది మరోసారి నిరూపించాడు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న వేళ పేట్రియాటిక్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా మందికి తెలియని ఒక రియల్ హీరో కథను దేశ ప్రజలకు చూపించాడు. దాని ఫలితమే ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాం. సినిమాను చూసినవారందరూ మంచి సినిమాను తీశారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు రౌడీహీరో కూడా ఈసినిమా చూసి సినిమాపై ప్రశంసలు కురిపించాడు. తన ట్విట్టర్ ద్వారా సినిమా గురించి చెబుతూ.. లవ్, ప్యాషన్, సిన్సియారిటీతో నిండి ఉన్న సినిమా అని.. మనల్ని రక్షించేవాడు.. మనం ఎన్నో నేర్చుకోవాల్సిన వ్యక్తి.. నిజమైన ఆదర్శప్రాయుడు.. కచ్చితంగా మన రియల్ హీరో గురించి తెలుసుకునేందుకు సినిమాను చూడాల్సిందే.. టీం మొత్తానికి కంగ్రాట్స్.. మేజర్ తల్లిదండ్రులకు నా ప్రేమ, గౌరవాలు అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు

కాగా ప్రస్తుతం విజయ్ పూరీ కాంబినేషన్ లో ఫైటర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా పూరీతోనే జనగణమన సినిమా చేస్తున్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fifteen =