
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 129


'ఖైదీ2' లైన్ రివీల్ చేసిన లోకేష్..!

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్

"ప్రిన్స్ "మూవీ కథానాయిక లుక్ రిలీజ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'ప్రణీత'

విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన "దర్జా " మూవీ ట్రైలర్

"ముగ్ధ "మనోహరంగా అనుపమ

'బ్రహ్మస్త్ర' నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్

లక్ష్ 'ధీర' సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

"మేజర్ " మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'

'మేజర్' నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..!

విహార యాత్రలో కీర్తి సురేష్

రిలీజ్ అయిన "గాడ్సే" మూవీ ట్రైలర్

'టాప్ గేర్' అంటున్న ఆది..!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటే.. ఆది మాత్రం డజనువరకూ సినిమాలను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బ్లాక్ సినిమాను రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఆది లిస్ట్ లో అమరన్, కిరాతక, క్రేజీ ఫెల్లో, తీస్ మార్ ఖాన్, అతిథి దేవో భవ ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ ను జరుపుకంటున్నాయి.

'ఖైదీ2' లైన్ రివీల్ చేసిన లోకేష్..!
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

బెంగుళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ అప్ డేట్
భోగినీ గా జీవితం ప్రారంభించి చివరకు యోగినిగా బతుకు చాలించిన గొప్ప మహిళ బెంగళూరు నాగరత్నమ్మ . 1878సంవత్సరం లో పుట్టిన నాగరత్నమ్మ భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి ఎంతో సేవ చేశారు. ఆమెకు త్యాగరాజ స్వామి అంటే ఆరాధనా భావం.కావేరి నది ఒడ్డున ఆయన సమాధి శిధిలావస్థలో ఉంటే ఆ స్థలం కొని అక్కడ ఆయనకు ఓ గుడి కట్టించారు. బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ మూవీ ని పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు.

"ప్రిన్స్ "మూవీ కథానాయిక లుక్ రిలీజ్
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో “#SK 20” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'ప్రణీత'
కరోనా వల్ల సినీ పరిశ్రమకు చాలా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.. ఎన్నో సినిమాల షూటింగ్ లు మద్యలోనే ఆగిపోయాయి. అయితే కరోనా మాత్రం సెలబ్రిటీల పెళ్లిళ్లకు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఎంతో మంది హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు కరోనా టైమ్ లోనే జరిగాయి. అందులో నటి ప్రణీత సుభాష్ కూడా ఉంది. కరోనా టైమ్ లోనే ప్రణీత వివాహం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొద్దిమంది సమక్షంలో ప్రణీత వివాహం జరిగింది. రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది.

10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న "#NBK107" మూవీ ఫస్ట్ హంట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

ఓవర్సీస్ లో "అంటే .. సుందరానికీ!" మూవీ కి అద్భుత స్పందన
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈమూవీ లో హీరో నాని తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా నటించి ఆ పాత్రకి న్యాయం చేశారు.నజ్రియా నజీమ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన "దర్జా " మూవీ ట్రైలర్
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం "దర్జా" తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్ ముఖ్య పాత్రలలో నటించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శివశంకర్ పైడిపాటి నిర్మాత కాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.

"ముగ్ధ "మనోహరంగా అనుపమ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

థాంక్యూ.. 'మారో మారో' సాంగ్ రిలీజ్..!
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మనం సినిమా రాగా ఈసినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా జులై 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్..

'బ్రహ్మస్త్ర' నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!
బాలీవుడ్ లో ఈఏడాది వస్తున్న పెద్ద సినిమాల్లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన పలు గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమాను మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్న ఆ తరువాత కథ ప్రకారం మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

'జయమ్మ పంచాయితీ' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
బుల్లితెర క్వీన్ అంటే ఎవరంటే ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ వినిపించే పేరు సుమ. యాంకరింగ్ తోనే బుల్లితెరపై రాణిస్తూ.. యాంకరింగ్ లో తనకు ఎవరూ సాటిలేరు అన్న రేంజ్ కు ఎదిగింది. దాదాపుగా ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే మనకు ముందుగా సుమనే కనిపిస్తుంది. సెలబ్రిటీలు కూడా సుమనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇక బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సుమ చాలా ఏళ్ల తరువాత మళ్లీ వెండితెరపై పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలో కనిపించి అలరించింది. జయమ్మ పంచాయితీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా రిజల్ట్…

వారం రోజులలో 250 కోట్లకు పైగా వసూళ్ళతో "విక్రమ్ "
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్
ఇండస్ట్రీలో రోజు రోజు కు క్రియేటివిటీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒకే చట్రంలో ఉండకుండా ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లోకి ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు కూడా చేరిపోయారు. ప్రొడ్యూసర్ గా, రైటర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న ఎం.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారి మరో జర్నీ స్టార్ట్ చేశారు. 'డర్టీ హరి' అంటూ మొదటిసారి దర్శకత్వం చేసి మొదటి సినిమాతోనే హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

లక్ష్ 'ధీర' సెకండ్ షెడ్యూల్ కంప్లీట్
విలక్షణ కథలను ఎంచుకుంటూ కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు యంగ్ హీరో లక్ష్. 'వలయం' సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు లక్ష్. ఇప్పుడు కాస్త విలక్షణమైన కథలను మత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆ దిశగానే తన సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేసిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. జూన్ 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో చాలా ఘనంగా విడుదల చేయనున్నారు

"మేజర్ " మూవీ కి బిగ్ బీ అమితాబ్ బెస్ట్ విషెస్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ అద్భుతంగా నటించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా జులై1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అంతేకాదు ఇప్పటికే పాటలు, టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు కూడా. మరోవైపు ట్రైలర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూన్12 ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్…

'మేజర్' నా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..!
రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో మంచి ప్రేక్షకాదరణ పొందిన సినిమా మేజర్. ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించగా, ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచిన ఉన్ని కృష్ణన్ బయోపిక్ ను తీసినందుకు చాలా మంది చిత్రయూనిట్ ను అభినందిస్తున్నారు కూడా.

విహార యాత్రలో కీర్తి సురేష్
తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

రిలీజ్ అయిన "గాడ్సే" మూవీ ట్రైలర్
వైవిధ్యమైన కథాంశాలతో, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రస్తుతం “గాడ్సే “, “గాడ్ ఫాదర్”, "గుర్తుందా శీతాకాలం ",“రామ్ సేతు" (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా సత్యదేవ్ ఒక ఆసక్తికర మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.