విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మనం సినిమా రాగా ఈసినిమా క్లాసికల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా జులై 8వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇక వీటితో పాటు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ‘మారో మారో ’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ‘సై అంటే సైరా సంసిద్ధం లేరా..సంకల్పం సంధిస్తాలే పంతం సాధించేలా.. పోరాటం క్రీడ..నీ మతమైతేరా..క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా…మారో మారో యుద్ధం మొదలు..తాడో పేడో తేల్చెయ్ ఇపుడు’ అంటూ సాగే ఈపాటను దీపు మరియు ప్రదీప్ చంద్ర ఆలపించగా.. విశ్వ, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.
The lyrical video of #MaaroMaaro from #ThankyouTheMovie is out now 🎶🎵🏑
▶️https://t.co/Kp6n6bjN2L@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/oWUTUbDLT9
— Sri Venkateswara Creations (@SVC_official) June 10, 2022
ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























