‘భలే భలే మగాడివోయ్’ సీక్వెల్ ప్లాన్

Maruthi About Bhale Bhale Magadivoy Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Maruthi,Director Maruthi,Maruthi latest Movie Updates,Maruthi Upcoming Movie Updates,Maruthi latest News,Maruthi About Bhale Bhale Magadivoy Sequel,Director Maruthi Planning For Bhale Bhale Magadivoy Movie Sequel, Maruthi upcoming Movies,Maruthi Next Projects,Maruthi Latest Super Hit Movie Pakka Commercial,Maruthi latest Movie With Gopichand and Raashii Khanna pakka Commercial Movie

ఈరోజుల్లో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు మారుతి. ఇక ఆసినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయి హిట్ అయింది. ఆ తరువాత కూడా యూత్ టార్గెట్ గా ఒకటి రెండు సినిమాలు తీసినా.. తను తీసిన కామెడీ హార్రర్ మూవీ ప్రేమకథా చిత్రమ్ సినిమా మాత్రం కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఇక ఇప్పటి వరకూ దాదాపు తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. దర్శకుడిగా తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. రీసెంట్ గానే పక్కా కమర్షియల్ సినిమాతో మరో డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. గోపీచంద్-రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు మంచి టాకే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఇప్పుడు తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మారుతి. ఆ సినిమా మరేదో కాదు నాని హీరోగా వచ్చిన భలే భలే మగాడివోయ్. అప్పటికే పలు ఫ్లాప్స్ తో బాధపడుతున్న నాని కి ఈసినిమా సూపర్ హిట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తరువాత కూడా నాని వరుసగా విజయాలను సొంతం చేసుకున్నాడు. మతి మరుపు ఉన్న పాత్రలో నాని తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. అయితే ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుపుతున్నాడు మారుతి. భలే భలే మగాడివోయ్ మూవీ కి సీక్వెల్ తీస్తే బాగుంటుందని ఎప్పటినుండో నాని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం తనని సోషల్ మీడియాలో కోరడం జరిగిందని, అయితే అప్పట్లో దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదని, లేటెస్ట్ గా ఆ మూవీకి సీక్వెల్ తీయాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. చూద్దాం మరి ఈ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =