ఎడిటర్ గౌతంరాజు కుటుంబానకి ‘చిరు’ సాయం..!

Chiranjeevi Helps Editor Goutham Raju Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Star Chiranjeevi,Chiranjeevi,Mega Star Chiranjeevi helps Ediotr Goutham Raju Family,Editor Goutham Raju,Ediotr Goutham Raju,Goutham Raju Family, Chiranjeevi latest News,Chiranjeevi Latest Updates,Chiranjeevi About Goutham Raju,Ediotr Goutham Raju Passes Away,Chiranjeevi latest Movie Udpates, Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Shoot Updates,Chiranjeevi Movies,Chiranjeevi Helps Fmaily of Goutham Raju

ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో ప్రముఖ ఎడిటర్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే కదా. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే కదా. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గతకొద్దికాలంగా బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో చిత్ర పరిశ్రమనుండి ప్రముఖులు అందరూ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా గౌతంరాజు మృతిపట్ల స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియచేస్తూ.. ఆయన కుటుంబానికి రెండు లక్షల రూపాయలను సాయం అందించారు. దర్శక, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా ఈ సాయాన్ని అందజేశారు చిరు. ఈ మేరకు గౌతం రాజు కుటుంబ సభ్యులకు సాయాన్ని అందచేసిన భరద్వాజ…తమకు అండగా ఉంటామని, ధైర్యం కోల్పొవద్దని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పినట్టు వెల్లడించారు.

కాగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 850పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసి.. చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎడిటర్ గా పరిచయమైన ఆయన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర హీరోల నుంచి ఈతరం స్టార్ల వరకు అందరి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి మెప్పించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.