మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా మొదలుపెట్టారు కూడా. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల వల్ల గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నాడట శంకర్. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ఏదో ఒక 10 మంది 20 మందితో కాదు ఏకంగా 1200 మందితో ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 20 రోజులు ఈ యాక్షన్ సీక్వెన్స్ పట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అమృత్ సర్ లో 1000 మందితో ఒక పాటను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ చివరి లోపు ఈసినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: