మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ లో గోపీచంద్, రాశీ ఖన్నా ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో గోపీచంద్ , రాశీ ఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన “థ్యాంక్యూ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“థ్యాంక్యూ ” పదం పై రాశీఖన్నా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన నెక్స్ట్ ఫిల్మ్ “థ్యాంక్యూ ” ఒక ఆలోచన రేకిత్తించిందనీ , జీవితంలో ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తుందనీ , మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలో తనతో #themagicwordisthankyou లో జాయిన్ అవ్వమనీ , తన వరకూ తనకు సపోర్ట్ , ప్రేమ అందిస్తున్న తన తల్లిదండ్రులు , అన్నయ్య , వదినలకు “థ్యాంక్యూ ” అనీ ,తనకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇచ్చే మేనల్లుడు నీల్ కు “థ్యాంక్యూ ” అంటూ రాశీ ఖన్నా తన మేనల్లుడు తో ఉన్న ఫొటో తో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























