ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 78
ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
"వైల్డ్ డాగ్" మూవీ అప్ డేట్
'మోసగాళ్ళు' రిలీజ్ డేట్ ఫిక్స్
అతనే నా అందాల రాకుమారుడు -సమంత
'एक Mini కథ'-ఫస్ట్ లుక్ రిలీజ్

100 కోట్ల క్లబ్ లో 'ఉప్పెన'
'ఆకాశవాణి' టీజర్ రిలీజ్
'శ్రీకారం' ట్రైలర్ రిలీజ్
కన్ఫామ్ - రామ్ సినిమాలో కృతిశెట్టి

'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసుకున్న బుట్టబొమ్మ
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్
'ఇష్క్' ఫస్ట్ లుక్ రిలీజ్
'కార్తికేయ2' లో అనుపమ్ ఖేర్
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. గత ఏడాదే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ‘కార్తికేయ 2’ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆతరువాత రెగ్యులర్ షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈసినిమా సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఈసినిమాకు సంబంధించి ప్రీ పొడక్షన్ తదితర కార్యక్రమాలు పక్కగా పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
'గాలి సంపత్' నా జీవితంలో ఒక ఆణిముత్యం - రాజేంద్ర ప్రసాద్
43 ఏళ్లు టెస్ట్ చేసి గాలి సంపత్ సినిమా నా కోసంరాసినట్టు ఉంది అంటున్నారు నట కిరిటీ రాజేంద్రప్రసాద్. అనీష్ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ - శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా గాలి సంపత్. ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిన్న ఘనంగా నిర్వహించారు.
'గాలి సంపత్' నా జీవితంలో జరిగిన అద్భుతం - శ్రీవిష్ణు
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అతిథిగా రాగా చిత్రయూనిట్ తో పాటు ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"వకీల్ సాబ్ " ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
సినిమా లవర్స్ మాత్రం ఆ ఏడాది పండగే పండగ. గ్యాప్ లేకుండా ప్రతివారం కనీసం ఓ నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అవి కూడా ఏదో చిన్నా చితకా సినిమాలు.. లైట్ తీసుకునే సినిమాలు కూడా లేవు. అన్నీ మంచి భారీ అంచనాలతో వస్తున్న సినిమాలే. కొన్ని సినిమాలు మాత్రం గత ఏదాది రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉన్నవి.. ఇంకొన్ని సినిమాలు ఆ ఏడాది రిలీజ్ కు సిద్దంగా ఉన్నవి.. వెరసి గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చిరు 'ఆచార్య', పవన్ 'వకీల్ సాబ్', ప్రభాస్…
"వైల్డ్ డాగ్" మూవీ అప్ డేట్
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అహిషోర్ సల్మాన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ACP విజయ్ వర్మ గా నాగార్జున నటించిన ఈ మూవీ లో దియా మీర్జా , సయామీ ఖేర్ , అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
'మోసగాళ్ళు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఎన్నో ఏళ్ల నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. అందుకే ఈసారి రొటీన్ కు భిన్నంగా ఉండే కథను సెలెక్ట్ చేసుకొని మోసగాళ్ళు అనే కథతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిజానికి ఈసినిమా గురించి మొదట్లో పెద్దగా బజ్ లేకపోయినా.. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈసినిమా ఎప్పుడొస్తుందా…
అతనే నా అందాల రాకుమారుడు -సమంత
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో "శాకుంతలం " మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందనున్న "శాకుంతలం " మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తున్న "శాకుంతలం " మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్టింగ్స్ తో రూపొందనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
'एक Mini కథ'-ఫస్ట్ లుక్ రిలీజ్
నూతన దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో శోభన్ హీరోగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా నుండి మినీ లుక్ అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్స్ ను బట్టి సినిమా హైట్ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతుంది.

100 కోట్ల క్లబ్ లో 'ఉప్పెన'
బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింతో తెలుసు కదా. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ డెబ్యూ హీరో ఏ డెబ్యూ హీరోకి రాని కలెక్షన్స్ రాబట్టుకొని కొత్త రికార్డులు సృష్టించాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇక తాజాగా ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'ఓ మంచి…
‘షాదీ ముబారక్’ చిత్రాన్ని అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఎంజాయ్ చేస్తున్నారు - హీరో ఆర్ కే సాగర్
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలు హత్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నోసూపర్ డూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ నుండి వచ్చిన మరో ప్లజంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్’. పద్మ శ్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 5న గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో ..
అమెజాన్ ప్రైమ్ లో 'అక్షర'
బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'అక్షర'. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యావ్యవస్థలోని లోపాలును చూపిస్తూ ఈసినిమాను రూపొందించినఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
శర్వా బర్త్ డే ట్రీట్... మహాసముద్రం ఫస్ట్ లుక్ - కొత్త సినిమా టైటిల్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. తన సినిమాల అప్ డేట్ లు ఇచ్చారు శర్వా దర్శక నిర్మాతలు. ప్రస్తుతం శర్వా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు శర్వా పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
'ఆకాశవాణి' టీజర్ రిలీజ్
రాజమౌళి దగ్గర అనేక సినిమాలకు పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇప్పుడు తాజాాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
'శ్రీకారం' ట్రైలర్ రిలీజ్
రణరంగం, పడిపడి లేచే మనసు,జాను లాంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. ఈనేపథ్యంలో రైతులు, వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ను తీసుకొని ఇప్పుడు శ్రీకారం సినిమాతో వస్తున్నాడు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
కన్ఫామ్ - రామ్ సినిమాలో కృతిశెట్టి
టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే ఇంకెవరూ ఉప్పెన భామా కృతిశెట్టి అని టక్కున చెప్పొచ్చు. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మొత్తాన్ని తన మాయలో పడేసింది ఈభామ. సినిమా రిలీజ్ కాకముందే ఈ హీరోయిన్ ను పలు అవకాశాలు వరించాయంటేనే చెప్పొచ్చు ఎంత క్రేజ్ తెచ్చుకుందో. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ అమ్మడి డైరీలోకి మరో సినిమా వచ్చింది.

'ఆచార్య' షూటింగ్ పూర్తి చేసుకున్న బుట్టబొమ్మ
కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా నటిస్తుండతంతో ఈసినిమాపై క్రేజ్ ఇంకా పెరిగింది. ప్రస్తుతం సినిమా మారేడు మిల్లిలోని అటవీ ప్రాంతంలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిరంజీవి, చరణ్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
చావు కబురు చల్లగా ట్రైలర్ రిలీజ్
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా వాటిక్ మంచి స్పందన లభించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు.
'గాలి సంపత్' - పాప ఓ పాప సాంగ్ రిలీజ్
అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
'ఇష్క్' ఫస్ట్ లుక్ రిలీజ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చిన్నప్పుడే తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ. ఇక ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమా చేసి తన మొదటి సినిమాతోనే హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ఇష్క్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.