అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గాలి సంపత్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అతిథిగా రాగా చిత్రయూనిట్ తో పాటు ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ…అడిగిన వెంటనే అతిథిగా వచ్చినందుకు రామ్ కు థ్యాంక్స్ చెపుతూ రామ్ ను ప్రశంసించాడు. నేను ఇండస్ట్రీకి రాకముందు చిన్నచిన్నకథలు రాసుకునే వాడిని.. ఏ డైరెక్టర్ కథలు రాసుకున్నా తన హీరో అద్భుతంగా చేయాలి అనుకుంటాడు.. అలానే నేను కథలు రాసుకున్నప్పుడు కూడా రామ్ గారే మైండ్ లోకి వచ్చేవారు.. ఇండస్ట్రీలో ఏదైనా చేయగలిగే అతికొద్దిమంది నటుల్లో రామ్ ఒకడు.. కంప్లీట్ యాక్టర్ అని పొగడ్తలు కురిపించాడు. ఇక గాలి సంపత్ జర్నీ.. నా లైనప్ లో నేను ఉన్నప్పుడు ఏదో అద్భుతాలు జరుగుతాయి అంటారు కదా అలా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఈ కథ వింటూనే బలే ఉంది ఈపాత్ర ఎవరు చేస్తున్నారు అనగానే రాజేంద్ర ప్రసాద్‌గారు అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈసందర్బంగా ఆయనకు సారీ చెప్పే అవకాశం కూడా లభించింది… నేను చిన్నప్పుడు చూసిన మొదటిహీరో ఆయనే.. ఆయన ఒడిలో కూర్చొని సినిమా చూస్తు ఈసినిమాలో హీరో ఎవరు అని ఆయన్నే అడిగా.. నన్నెప్పుడూ చూడలేదా అని అడిగారు ఆయన.. అందుకుఇప్పుడు సారీ చేపుతున్నా సార్ అన్నాడు. ఇక ఈ కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ సినిమా చేశారు. నేను ఇంత వరకూ ఏ ఇనిస్ట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకోలేదు. కాని ఈ సినిమాతో వరల్డ్‌లో బెస్ట్ యాక్టర్ దగ్గర నేను ట్రైన్ అయ్యాను. అది నా తర్వాతి చిత్రాల్లో మీరు కూడా చూస్తారు. క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన నటనకి రెండు చేతులు ఎత్తి దండం పెడతారు. అంత అద్భుతంగా నటించారు“ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: