కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, టీజర్ గ్లిమ్ప్స్, మైనేమ్ ఈజ్ రాజు పాటను విడుదల చెయ్యగా వాటిక్ మంచి స్పందన లభించింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గట్టిగానే చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో.. అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి.. అలాగే లావణ్య త్రిపాఠి గెటప్.. సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
Tonnes of Fun + Too much of Craziness = #ChaavuKaburuChallaga 𝗧𝗵𝗲𝗮𝘁𝗿𝗶𝗰𝗮𝗹 𝗧𝗿𝗮𝗶𝗹𝗲𝗿#CKCTrailer : https://t.co/x77p3Qzmnf#AlluAravind @ActorKartikeya @Itslavanya @Koushik_psk @JxBe #KarmChawla #BunnyVas @imsarathchandra @adityamusic @GA2Official #CKCFromMarch19th pic.twitter.com/bGdiK4rqC7
— Geetha Arts (@GeethaArts) March 5, 2021
కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మురళీ శర్మ, ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్,భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మార్చి 19 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























